ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prithviraj Sukumaran I Nobody in silent mode

వారణాసి విలన్ సినిమా ఇంత సైలెంట్ గానా?

Prithviraj Sukumaran I Nobody in silent mode


ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో క్రేజీ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంతోనే కాదు పృథ్వీరాజ్ సలార్ చిత్రంలోనూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అసలు లూసిఫర్ తెరకెక్కించిన పృథ్వీరాజ్ ను తెలుగు ఆడియన్స్ ఎప్పుడో ఓన్ చేసుకున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ వారణాసి సినిమాతో పాటుగా మాతృభాషలోను సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన ఐ నోబడి రేపు శుక్రవారమే విడుదలకు సిద్ధమైంది. తెలుగులో మైత్రి మూవీస్-స్రవంతి మూవీస్ కలిపి విడుదల చేస్తున్నారు. వారణాసి విలన్ సినిమా అంటే తెలుగులో ఎంత క్రేజ్ ఉండాలి.

కానీ ఐ నోబడి పై తెలుగులో హడావిడే లేదు, ప్రమోషన్స్ లేవు. ఆ సినిమా వస్తుంది అనే ఆలోచనలో, ఆసక్తితో ఆడియన్స్ కనిపించడం లేదు. క్రేజీ హీరో.. వారణాసి లో విలన్ గా మరింత పాపులర్ అయిన పృథ్వీరాజ్ సినిమా అంటే ఏ రేంజ్ హడావిడి ఉండాలి. కానీ ఐ నోబడిపై ఎక్కడా హడావిడి లేదు.

మరి పృథ్వీరాజ్ తెలుగులో సినిమా విడుదల చేస్తున్నప్పుడు అందుకు తగిన ప్రమోషన్స్ తో ఆడియన్స్ లోకి వెళ్లాయి. కానీ ఇంత సైలెంట్ గా ఉంటె ఓపెనింగ్స్ ఏం వస్తాయి.. 

Prithviraj Sukumaran, I Nobody