రూ.100కోట్లు టచ్ చేసిన కోలీవుడ్ హీరో
Suriya's Remuneration Set To Touch ₹100 Crore
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొన్నేళ్లుగా విజయాలకు దూరమయ్యారు. వరస సినిమాలు చేస్తున్నా ఆయనకు సక్సెస్ దక్కి చాలా రోజులైపోయింది. రీసెంట్ గానే ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో వచ్చిన కరుప్పు సూర్య కు బిగ్ రిలీఫ్ నిచ్చింది. ఆ చిత్రం రూ.300 కోట్ల క్లబ్బు ని టచ్ చేసి సూర్య రేంజ్ పెరిగేలా చేసింది.
ఆ చిత్రం తర్వాత సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తో విశ్వనాధ అండ్ సన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా విడుదలకు రెడీ అవుతుంది. వాడి వాసల్ తో పాటుగా కరుప్పు సక్సెస్ ఊపులోనే తమిళనాట ఇతర ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. అంతేకాదు సూర్య రేంజ్, క్రేజ్ కూడా పెరిగిపోయింది.
అందుకే సూర్య ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్బులో అదేనండి రూ.100 కోట్ల పారితోషికం క్లబ్బులో చేరినట్లుగా తెలుస్తుంది. సూర్య ఇకపై ఒప్పుకునే చిత్రాలకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి సూర్య కు రూ.100 కోట్లు ఇచ్చే నిర్మాత ఎవరో, ఆ క్రేజి ప్రాజెక్ట్ ఏమిటో అనేది చూడాలి.







































