ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sahni Kapoor penned a heartfelt birthday wish for her mother

అమ్మ‌పై కుమార్తె అద్భుత‌మైన పోస్ట్!

Sahni Kapoor penned a heartfelt birthday wish for her mother

 

బాలీవుడ్  సీనియ‌ర్  నటి నీతూ కపూర్  68వ పుట్టినరోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె కుమార్తె, నటి పారిశ్రామికవేత్త రిద్ధిమా కపూర్ సాహ్నీ తల్లిపై ఉన్న ప్రేమను
మ‌రోసారి చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రిద్ధిమా న తల్లితో కలిసి గడిపిన మధుర జ్ఞాపకాలను ఒక వీడియో మాంటేజ్ రూపంలో పంచుకున్నారు. `హ్యాపీ బర్త్‌డే మా, నా హృదయం, నా సర్వస్వం. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను` అని  ఆత్మీయంగా రాసుకొచ్చారు.

రిద్ధిమా పంచుకున్న ఫోటోలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. చిన్నారి రిద్ధిమాను నీతూ తన చేతుల్లో పట్టుకున్న పాత జ్ఞాపకం నుండి ఇటీవల ఇద్ద‌రు  కలిసి బయటకు వెళ్ళినప్పటి ఫోటోల వరకు ప్రతి ఒక్కటి వారి మధ్య విడదీయలేని బంధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీటితో పాటు నీతూ చిన్నతనంలో నటించిన `దో కలియాన్` చిత్రంలోని ఫోటోను ,  ఇటీవల జరిగిన బర్త్‌డే  వేడుకల ఫోటోలను కూడా రిద్ధిమా అభిమానులతో పంచుకున్నారు.

నీతూ కపూర్ సినీ ప్రస్థానాన్ని `బేబీ సోనియా` అనే చిత్రంతో  బాలనటిగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రిషి కపూర్, నీతూ కపూర్ జంటగా కలిసి నటించిన `జహ్రీలా ఇన్సాన్ ` తో  కథానాయికగా అడుగుపెట్టారు. వివాహానంతరం సినిమాలకు కొంత విరామం ఇచ్చినా?  మళ్ళీ `లవ్ ఆజ్ కల్ ` రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల `దాదీ కి షాదీ`లో  కుమార్తె రిద్ధిమాతో కలిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Sahni Kapoor emotional birthday wishes to her mother