ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Gulshan Devaiah to make his Telugu debut with Samantha's MIB

బాల్యం నుంచే తెలుగు సినిమాతో వీడ‌దీయ‌లేని బంధం!

Gulshan Devaiah to make his Telugu debut with Samantha's MIB

బాలీవుడ్ లో త‌న‌కంటూ  ప్రత్యేకమైన  గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుల్షన్ దేవయ్య. ఇటీవ‌లే రిలీజ్ అయిన  తెలుగు సినిమా `మా ఇంటి బంగారం`లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో అత‌డి పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. గుల్ష‌న్ న‌ట‌న ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తాజాగా గుల్ష‌న్ బాల్యం గుర్తు చేసుకున్నారు.
బెంగళూరులో పెరిగిన త‌న‌కు  బాల్యం నుంచే దక్షిణాది చిత్రాలతో విడదీయలేని అనుబంధం ఉంద‌న్నారు.

`దక్షిణాది సినిమాలు నా ఎదుగుదలలో ఒక భాగం. నా చిన్నతనంలో తెలుగు, తమిళ స్నేహితుల మధ్య పెరగడం వల్ల ఈ సంస్కృతి బాగా  పరిచయమైంది. `శివ`, `క్షణ క్షణం` వంటి చిత్రాలు నాపై ఎంతో ప్ర‌భావం చూపి స్తాయ‌న్నారు. `మా ఇంటి బంగారం` చిత్రంలో మాజీ నక్సలైట్ కరుణ పాత్రలో గుల్షన్ నటన ప్రేక్షకులను ఎంత‌గానో అల‌రించింది.

ఈ పాత్ర కోసం ఆయన రాయలసీమ మాండలికాన్ని నేర్చుకోవడంతో పాటు, ఎంతో కసరత్తు చేశారు. సెట్స్‌లో దర్శకురాలు నందిని రెడ్డి అందించిన సహకారం, తనకు భాషా పరమైన ఇబ్బందులు లేకుండా పని చేయడానికి ఎంతో తోడ్పడిందని  ప్రశంసించారు. తాను ఏ పాత్ర పోషించినా?  ఆ పాత్ర  వ్యక్తిత్వాన్ని  మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తానని  తెలిపారు.

నటన పరంగానే కాకుండా హైదరాబాద్‌తో కూడా  విడదీయలేని బంధం ఉందని గుల్షన్ గుర్తు చేసుకున్నారు.  ఇక్కడి అల్పాహార సంస్కృతి, వెజ్ , నాన్-వెజ్ వంటకాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. భవిష్యత్తులో కూడా  ఆసక్తికర కథలు వస్తే దక్షిణాదిలో న‌టిస్తాన‌న్నారు.
 

Gulshan Devaiah