మావిగన్ కామెడీ విన్నారా..
Jana Sena Leader Phone Call To Jogi Ramesh
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు కి మంచి పేరు వచ్చేస్తుందో అని తాను సీఎం అవ్వగానే మూడు రాజధానులు అంటూ డ్రామా చేసి ఐదేళ్లు ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా చేసారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతికి చట్టబద్దత కలిపించిన తర్వాత మావిగన్ అంటూ డ్రామా స్టార్ట్ చేసారు జగన్.
అమరావతి అంటే అభివృద్ధి ఒక్కచోటే జరుగుతుంది, అమరావతి కూటమి నేతలకు బిజినెస్ చేసుకునే రాజధాని, కొత్తగా రాజధాని అంటే మావిగన్ అంటూ మచిలీపట్నాన్ని కలపమని మీడియా ముందు డ్రామా స్టార్ట్ చేసారు. వైసీపీ నేతలు కూడా జగన్ కు వంతపాడుతున్నారు. అమరావతిలో టీడీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, పెద్ద ఎత్తున పోగేసుకుంటున్నారు, మావిగన్ అయితే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుంది అంటూ హడావిడి మొదలు పెట్టారు.
అయితే జగన్ చెప్పిన మావిగన్ రాజధాని అనేది ఎంత కామెడీగా మారిందో నిన్న ఓ ఫోన్ కాల్ వింటే అర్ధమవుతుంది. వైసీపీ నేత జోగి రమేష్ కి జనసేన నేత ఒకరు ఫోన్ చేసి సర్ జోగి రమేష్ గారా.. మావిగన్ కు వెళ్లాలంటే ఏ బస్ ఎక్కాలి సర్.. కర్ణాటక వెళ్లాలంటే బెంగుళూరు బస్ ఎక్కాలి, ఒరిస్సా వెళ్ళాలి అంటే భువనేశ్వర్ బస్సు ఎక్కాలి, పశ్చిమ బెంగాల్ వెళ్ళాలి అంటే కోల్కత్త బస్ ఎక్కాలి.
మరి మావిగన్ కి వెళ్ళాలి అంటే ఏ బస్ ఎక్కాలి అని అడగగానే జోగి రమేష్ ఫోన్ కట్ చేసిన లీక్ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జగన్ సృష్టించిన మావిగన్ ఎంత కామెడీ అయ్యిందో ఏపీ ప్రజలు మొత్తం విన్నారు.







































