నయనతార - నెమలి నాట్యమాడేనా
Nayanthara latest saree look viral
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార అందం గురించి ఎంత మట్లాడుకున్నా తక్కువే. 40 ప్లస్ ఏజ్ లోను ఇంకా యంగ్ హీరోయిన్స్ తో అందంతో అభినయంతో పోటీపడే నయనతార బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో వంశి పైడిపల్లి తెరకెక్కిస్తున్న మూవీ తో పాటుగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.
ఇక నయనతార మొదటినుంచి లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంది. భర్త విగ్నేష్ శివన్ తోనూ, కొడుకులతో విహార యాత్రలకు వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ ని విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు తప్ప నయన్ అలా చెయ్యదు. అందుకే నయనతార సోషల్ మీడియా లుక్స్ చాలా అరుదుగా దొరుకుతాయి.
తాజాగా నయనతార శారీ లుక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. నయనతార శారీ లుక్ అది. నయన్ చీర కట్టులో కూర్చున్న తీరుకి నెటిజెన్స్ నెమలి నాట్యమాడుతుందా అనిపించేలా ఉంది అని కామెంట్లు పెడుతున్నారు. బ్లూ చీర లో నయనతార లేటెస్ట్ లుక్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.







































