OG 2 సెప్టెంబర్ లో కలుద్దాం

Thaman Gives Updates On OG 2


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజిత్ కలయికలో గత ఏడాది విడుదలై హిట్ అయిన గ్యాంగ్ స్టర్ డ్రామా OG చిత్రానికి సీక్వెల్ ప్రకటించడమే కాదు దర్శకుడు సుజిత్ OG యూనివర్స్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు. PK క్రియేటివ్ వర్క్స్ ఎప్పటికప్పుడు OG 2 పై హైప్ క్రియేట్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు.

పవన్ OG యూనివర్స్ కోసం ఫోటో షూట్స్ చేయించడం, థమన్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ అంటూ అప్ డేట్ ఇలా OG యూనివర్స్ పై హైప్ క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. తాజాగా థమన్ ని ఓ ఈవెంట్ ల పవన్ ఫ్యాన్స్ OG2 అప్ డేట్ గురించి అడిగారు.

దానికి సెప్టెంబర్ లో కలుద్దామంటూ వారిని కూల్ చేసారు. అంటే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే కి OG యూనివర్స్ నుంచి ఏమైనా పెద్దగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారేమో, అందుకే థమన్ OG 2 పై అలా లీకులిచ్చారని పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
 

Thaman Leak On Pawan Kalyan's OG 2