పవన్ మాటిచ్చారు - OG 2 డిస్కర్షన్స్ స్టార్ట్
OG2 - Pawan -Sujeeth intense discussions
ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు చేస్తారా, ఆయన ఆరోగ్యం దృశ్య కొన్నాళ్ళు సినిమాలకు బ్రేకిస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ దర్శకుడు సుజిత్ తో OG సీక్వెల్ ని అనౌన్స్ చేసారు. పవన్ క్రియేటివ్ వర్క్స్ నుంచి OG యూనివర్స్ కి సంబందించిన న్యూస్ లు ట్వీట్ల రూపంలో వస్తున్నాయి.
దర్శకుడు సుజిత్ విదేశాలకు వెళ్లారు రాగానే OG 2 గురించిన చర్చలు మొదలవుతాయి, పవన్ మాటిచ్చారు, OG 2 షురూ అంటూ ట్వీట్ చేసిన కొద్దిరోజులకే సర్ ప్రైజింగ్ గా సుజిత్ తో పవన్ కళ్యాణ్ కలిసి OG యూనివర్స్ పై డిస్కర్స్ చేస్తున్న పిక్ ని వదిలారు. పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చినట్లుగానే, Creative Worksలోదర్శకుడు సుజిత్ తో #OGUniverse చర్చలు మొదలయ్యాయి! మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ అంటూ పవన్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసారు.
అనుకోకుండా వస్తున ఈ ఎగ్జైటింగ్ న్యూస్ లతో పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గనకే సుజిత్ దర్శకత్వంలో OG యూనివర్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇక త్వరలోనే OG 2 పట్టాలెక్కడం ఖాయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉత్సహంతో మాట్లాడుకుంటున్నారు.







































