ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anil Ravipudi Turns Promotions Into Entertainment

అనిల్ రావిపూడి కత్తిలాంటి ప్రమోషన్స్

Anil Ravipudi Turns Promotions Into Entertainment


అనిల్ రావిపూడి తను తెరకెక్కించే సినిమాని ఎలా ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ చెయ్యాలో బాగా తెలిసిన దర్శకుడు. షూట్ కాదు కాదు అనౌన్సమెంట్ నుంచే అనిల్ రావిపూడి ప్రేక్షకుల ఫోకస్ మొత్తం తన సినిమాపై ఉండేలా చూసుకోవడంలో స్పెషలిస్ట్. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు తో రఫ్ఫాడించిన అనిల్ రావిపూడి వెంకీ-కళ్యాణ్ రామ్ లతో తన తదుపరి చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో బిగిన్ చేసేసారు.

రేపు సోమవారం నుంచి రెగ్యులర్ షూట్ కి వెళుతున్న వెంకీ-కళ్యాణ్ రామ్ చిత్రాన్ని టుమారో రెగ్యులర్ షూట్ అని చెప్పడానికి చేసారే ఆ ప్రమోషనల్ వీడియో చూస్తే ఆహా, ఓహో అనిల్ రావిపూడి అనాల్సిందే. వెంకీ దగ్గరకు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ని ఏంటమ్మా అనిల్ నిన్ను బీచ్ ఇసుకలో పాతేసాడంట అని అడిగితె.. అవును సర్ మ్యూజిక్ సిట్టింగ్స్ అని పిలిచి ఇసుకలో పాతేసాడు సర్ అన్నాడు.

అమ్మో అనిల్ ని చూస్తే ఒణుకొచ్చేస్తుంది అన్న వెంకీ తో కళ్యాణ్ రామ్ పటాస్ అప్పుడు బాగానే ఉన్నాడు, మీరే అనిల్ ని పెంపర్ చేసి నేను పాడుతా దగ్గరనుంచి పాతేసేదాకా తీసుకొచ్చారు అన్నారు. ఈలోపు హీరోయిన్స్ ని భయపెడుతూ అనిల్ రావిపూడి కత్తితో ఎంట్రీ ఇస్తారు. నేను కత్తిలాంటి ప్రమోషన్స్ చేస్తాను అని ప్రేక్షకులు కాన్సెప్ట్ కింగ్ అంటూ ఈ తలపాగా పెట్టి కత్తి చేతికిచ్చారు అంటూ అనిల్ రావిపూడి బిల్డప్ ఇస్తారు.

దానితో వెంకీ కత్తి తీసుకుని అనిల్ రావిపూడి బొటన వేలు కట్ చేసి వీర తిలకం దిద్దడమే కాదు కళ్యాణ్ నేను కూడా హీరోనే కదా అని ఆయన, అమ్మాయిలు కదా వీర తిలకం దిద్దేది అని కీర్తి సురేష్, కృతి శెట్టిలు అనిల్ రావిపూడి రక్తంతోనే వీర తిలకం దిద్ది రంగంలోకి దింపిన వీడియో షేర్ చేస్తూ రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయినా మనది ఫ్యామిలీ సినిమా అంటూ అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్ తీరుకి ప్రేక్షకులు అబ్బురపడుతున్నారు. 

Anil Ravipudi Kathi Lanti Idea For Venkatesh, Kalyan Ram Film