ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Non-bailable warrant against Prakash Raj

ప్రకాష్ రాజ్ పై నాన్-బైలబుల్ వారెంట్

Non-bailable warrant against Prakash Raj

 

నటుడు ప్రకాష్ రాజ్ పై నాన్-బైలబుల్ వారెంట్ జారీ అవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ బిజెపి ని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తూ రాజకీయంగా హైలెట్ అవడమే కాదు, అటు సినిమాల విషయంలోనూ చాలా బిజీగా ఉన్న క్రేజీ నటుడు ఆయన.

అయితే ప్రకాష్ రాజ్ పై తాజాగా నమోదైన కేసు ఏమిటంటే.. ప్రకాష్ రాజ్ నాలుగు వేర్వేరు రాష్ట్రాల్లో అక్రమంగా ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణల ఆయనపై కోర్టు నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసింది. దేశంలో ఏ వ్యక్తి అయినా ఒకే ఓటర్ ఐడి కలిగి ఉండాలి. కానీ ప్రకాష్ రాజ్ కి నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడి కార్డులు ఉండడంతో..బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.

గతంలోనూ ఈ కేసులో కోర్టు ప్రకాష్ రాజ్ కి రెండుసార్లు సమన్లు జారీ చేసినా.. ప్రకాష్ రాజ్ కోర్టుకు హాజరవ్వకపోవడంతో సీరియస్ అయిన కోర్టు ఈసారి ప్రకాష్ రాజ్ పై నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి ఈ లెక్కన ప్రకాష్ రాజ్ అరెస్ట్ తప్పేలా కనిపించడం లేదు.

Bengaluru Court Issues Non-Bailable Warrant Against Actor Prakash Raj