టాక్సిక్ సునామీకి ప్యారడైజ్ బ్రేక్ వేస్తుందా?
Toxic vs Paradiseనేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత వైవిధ్యమైన, భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న `ది ప్యారడైజ్` పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ హైప్ నెలకొంది.
అయితే సరిగ్గా ఐదు రోజుల వ్యవధిలోనే (ఆగస్టు 26న) కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న గ్లోబల్ పాన్-ఇండియా మూవీ `టాక్సిక్` థియేటర్లలోకి వస్తుండటంతో, నాని సినిమా ఈ పాన్ ఇండియా రేసులో `టాక్సిక్` సునామీకి బ్రేక్ వేస్తుందా లేదా అనే ఆసక్తికరమైన చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఒకే వారంలో `ఇరుముడి`, శర్వానంద్ `భోగి` వంటి చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నా.. అసలైన వార్ మాత్రం నాని, యశ్ మధ్యే జరగనుంది.
కన్నడ స్టార్ యశ్ నటించిన `టాక్సిక్` చిత్రం మొదటి టీజర్‌తోనే దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లినా బాక్సాఫీస్ వద్ద నిలబడాలంటే ఈ చిత్రానికి గ్రౌండ్ లెవెల్‌లో మరింత ప్రచారం అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. `హానర్ థై ఫాదర్` అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా కేవలం టీజర్ హైప్‌తోనే సరిపెట్టకుండా ట్రైలర్‌తోనూ ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది.
పోటీలో ఎన్ని సినిమాలు ఉన్నా నాని `ది ప్యారడైజ్` చిత్రానికి కంటెంట్ పరంగా పాజిటివ్ టాక్ వస్తే.. అది తెలుగు రాష్ట్రాల్లో `టాక్సిక్`తో కలెక్షన్లు షేర్ చేసుకోవడంలో పోటీపడుతుందని అంచనా. మరి ఈ రసవత్తర పాన్ ఇండియా బాక్సాఫీస్ పోరులో నాని వైవిధ్యమైన కథతో యశ్‌ను ఢీకొట్టి విజేతగా నిలుస్తాడో లేదో చూడాలి!







































