మళ్ళీ జన నాయగన్ ముచ్చట షురూ

Jana Nayagan release date suspence

 

కెవిఎన్ ప్రొడక్షన్స్ వారి సినిమాలు ట్రాక్ లోకి వస్తున్నాయి. జూన్ 4 నుంచి విడుదల వాయిదా పడిన యశ్ టాక్సిక్ ఫైనల్ గా ఆగష్టు 26 విడుదల అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. అదే ప్రొడక్షన్ లో ఎప్పుడో విడుదల ఆగిపోయిన జన నాయగన్ విడుదల ఎప్పుడు అంటూ విజయ్ అభిమానులు ఒత్తిడి స్టార్ట్ చేసారు.

కెవిఎన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన విజయ్ జన నాయగన్ అసలు విడులవుతుందా, సెన్సార్ ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తుంది. ఎప్పుడు జన నాయకుడు ప్రేక్షకుల్లోకి వస్తాడు అనే విషయంలో సస్పెన్స్ పోయి అసహనం మొదలైంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ వారి సినిమాలు చాలావరకు ప్రాబ్లెమ్ ని ఫేస్ చేస్తున్నాయి.

ఎలాగో టాక్సిక్ బయటపడినా.. జన నాయకుడుకు ఇంకాస్త టైమ్ పట్టేలా కనిపిస్తుంది. అసలే డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బు వెనక్కి ఇచ్చారనే న్యూస్ ఉంది. ఈ లెక్కన జన నాయకుడు చిత్రం విడుదలపై హోప్స్ వదులుకోవాలా అనేది అభిమానుల ప్రశ్న. 
 

Toxic Release Date Announced – What About Jana Nayagan