బంగారం బరువు పెరుగుతుంది
Maa Inti Bangaram 2 days collections report
సమంత మా ఇంటి బంగారం బాక్సాఫీసు లెక్కలను మార్చేస్తుంది. ఎబోవ్ యావరేజ్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. సమంత స్టార్ పవర్ ఫస్ట్ డే మా ఇంటి బంగారం కి భారీ ఓపినింగ్స్ తీసుకొచ్చినా రెండోరోజు అట ఎలా ఉంటుందో అనేది అంచనా వేయలేకపోయారు.
కానీ మా ఇంటి బంగారం రెండో రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొట్టి కొన్ని ఏరియా ల్లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరపడింది. ఫ్యామిలీ ఆడియన్స్, లేడీ ఫ్యాన్స్ మా ఇంటి బంగారం చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడమే కలెక్షన్స్ పెరగడానికి కారణమైంది. ఇక ఈవారం మా ఇంటి బంగారం హిట్ గా నిలవడంతో అదనపు షోస్ కూడా యాడ్ అవుతున్నాయి.
సింగిల్స్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ ల్లో మా ఇంటి బంగారానికి అదనపు షోస్ యాడ్ అవడంతో రేపనుంచి కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక రెండో రోజు మా ఇంటి బంగారం చిత్రానికి రూ.28 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి ప్రకటించారు.
సో ఈరోజు ఆదివారం షోస్ పెరగడంతో బంగారం బరువు అదేనండి కలెక్షన్స్ కూడా మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది.







































