అథిరది మినీ రివ్యూ

Athiradi Mini Review

 

కొన్నాళ్లుగా తక్కువ బడ్జెట్ పెట్టి పెద్ద హిట్లు కొడుతున్నారు మలయాళ ఇండస్ట్రీ వాళ్ళు. చిన్న సినిమాలు మళయాళంలోనే కాదు ఇతర భాషల్లోనూ ఆడియన్స్ ఆదరణతో మంచి హిట్స్ నమోదు చేస్తున్నాయి. ఓటీటీ ల్లో మలయాళ చిత్రాలకు తెలుగు లో ఫుల్ గిరాకీ ఉంది. తాజాగా సోని లివ్ ఓటీటీ నుంచి మలయాళంలో సూపర్ హిట్ అయిన అథిరది చిత్రం మలయాళంలో పాటుగా తెలుగులోనూ స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

అరుణ్ అనిరుధన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతూ.. డైరెక్టర్ కమ్ యాక్టర్ బేసిల్ జోసెఫ్ హీరోగా స్టార్ హీరో టొవినో థామస్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో ఈ అథిరది తెరకెక్కింది.

అథిరది మినీ స్టోరీ:
స్టోరీ మొత్తం ఓ ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంది. కాలేజీలో జరిగిన ఆరోహణ ఫెస్ట్ లో గందరగోళం కారణంగా ముగ్గురు స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోతారు. అప్పటి నుంచి కాలేజీ యాజమాన్యం ఫస్ట్ లను రద్దు చేస్తుంది. కానీ సామ్ (బేసిల్ జోసెఫ్) అనే స్టూడెంట్ ఆ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ లో చేరతాడు. చదువుల్లో వెనకపడిన సామ్.. ఎలాగైనా ఆ ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు.

ఆ ఫెస్ట్ లో భాగంగా స్టూడెంట్స్ కి ఆ ఊరి మాజీ రౌడీ కుట్టన్ (టొవినో థామస్) కి మధ్యన గొడవ జరుగుతుంది. ఆరోహణ ఫెస్ట్ లో లైవ్ మ్యూజిక్ ఇప్పించేందుకు టాప్ సింగర్ ని తీసుకొచ్చే క్రమంలో కాలేజీ స్టూడెంట్స్ నుంచి ఆ సింగర్ ని కుట్టాన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది.. ఆతర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.

అథిరది స్క్రీన్ ప్లే: 
అథిరది రొటీన్ కథే అయినప్పటికి దర్శకుడు అరుణ్ అనిరుధన్, రైటర్ పాల్సన్ స్కారియాతో కలిసి దానిని కామెడీ ఎంటర్టైనర్ గా చూపించిన తీరుకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. పాత క్యాంపస్ పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ ఫార్ములా కథే అయినప్పటికీ, దానికి ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్లుగా మార్చి కథనాన్ని నడిపించారు.

కాస్త స్లో గా అనిపించినా సినిమా మొదటి నుండి చివరి వరకు ఫుల్ ఎనర్జిటిక్ గా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. విష్ణు విజయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది.

అథిరది ఎఫర్ట్స్:
పొట్టోడు గట్టోడు అన్న రీతిలో బేసిల్ జోసెఫ్ తన కామెడీ పెరఫార్మెన్స్ తో మరోసారి అద్దరగొట్టేసాడు. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. టొవినో థామస్ మాజీ రౌడీ కుట్టన్ పాత్రలో ఎంటర్టైన్మెంట్ తో కూడిన నటనను ప్రదర్శించారు. నటుడు వినీత్ శ్రీనివాసన్, మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ తమ నిజ జీవిత పాత్రలనే మూవీలో పోషించి నవ్వించారు.

అథిరది ఎనాలసిస్: 
టీ తాగుతూ హాయిగా ఎంజాయ్ చేసేలా ఈ అథిరది సినిమా ఉంటుంది. స్టూడెంట్స్ మాత్రమే కాదు ఫ్యామిలీస్ అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకునే సినిమా అథిరది. కాలేజ్ క్యాంపస్ లో ర్యాగింగ్స్, స్టూడెంట్స్ మనస్తత్వాలు, కాలేజీల్లో జరిగే ఫెస్ట్ లో ఎలా ఉంటాయో ఈ చిత్రంలో కాస్త డిఫ్రెంట్ గా చూపించారు. ఏదైనా సరదాగా చూసి ఎంజాయ్ చేసే సినిమా అథిరది. 
 

Athiradi Movie Review