గ్లామర్ చట్రాన్ని బద్దలు కొట్టే పనిలో మానసి పవార్!

Actress Manasi Pawar

ఒకే తరహా పాత్రలతో ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం చాలామంది నటీమణులకు ఎదురయ్యే పెద్ద సమస్య. తమలోని అసలైన నటనను, భిన్నమైన హావభావాలను ఆవిష్కరించే బలమైన పాత్రలు దొరకడం అంత తేలిక కాదు. అయితే మానసి పవార్‌కు  రాబోయే చిత్రం `రోజ్` ద్వారా అలాంటి ఓ అరుదైన అవకాశం దక్కినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, ఒక నటిగా తనలోని విభిన్న కోణాన్ని, దాగివున్న పూర్తి ప్రతిభను బయటకు తీయడానికి ఇదొక చక్కని వేదికగా నిలిచిందని  నమ్మకంగా చెబుతోంది.

కేవలం గ్లామర్ రోల్స్ ..కమర్షియల్ హంగులకే పరిమితం అయిపోతే చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించడం కష్టం. ఈ విషయాన్ని ముందే గ్రహించిన మానసి పవార్, ఒకే రకమైన పాత్రల ముద్ర పడకుండా ఉండేందుకు రోజ్ చిత్రాన్ని తన కెరీర్‌లో ఓ  మైలురాయిలా భావిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో నటనకు పెద్దపీట వేసే ఈ ప్రాజెక్ట్‌లో అమ్మ‌డు  అత్యంత సహజసిద్ధమైన అభినయంతో .. గుండెలను పిండేసే బలమైన భావోద్వేగాలను పండించబోతోందని  టాక్. ఈ సినిమా కోసం మాన‌సి  లుక్ ..బాడీ లాంగ్వేజ్‌ను కూడా పూర్తిగా మార్చుకుని విభిన్నమైన అవతారంలో అలరించనుంది.

ప్రస్తుతం ప్రేక్షకులు  రొటీన్ గ్లామర్ కంటే బలమైన కంటెంట్ వైవిధ్యం ఉన్న చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు.  మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మానసి చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఆమె కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పైకి లేపడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఎన్నో ఆశలు పెట్టుకుని మానసి పవార్ చేసిన  రోజ్ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సక్సెస్ అవుతుందో?  చూడాలి.

Rose will showcase a different side of me as a performer-Manasi Pawar