రష్మిక ను తొక్కేసే ప్రయత్నమా?
Bollywood Media targets Rashmika Mandanna
సౌత్ నుంచి హిందీలో అడుగుపెట్టిన చాలామంది హీరోయిన్స్ అక్కడ సక్సెస్ దొరక్క గోడక్కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేసారు. కొంతమంది ఒకటి అరా హిట్టుకే ముంబై లో ఉండిపోయారు. కానీ సౌత్ హీరోయిన్ రష్మిక ఇక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాప్ చైర్ కి దగ్గరవడమే కాదు బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ టాప్ హీరోయిన్స్ కి పోటీగా తయారైంది.
నటనకు నటన, గ్లామర్ కి గ్లామర్ తో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు పట్టేసింది. అదే అక్కడి హీరోయిన్ లకు కంట గుంపుగా మారింది. పైకి నవ్వుతూ ఆమెను తొక్కే ప్రయత్నాలు మొదలు పెట్టారనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అదే ఆమె తాజాగా హిందీలో నటించిన కాక్ టైల్ 2 చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ చిత్రంలో కృతి సనన్ తో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి సనన్, రష్మిక గ్లామర్ విషయంలో పోటీపడ్డారు. అంతేకాదు ప్రమోషన్స్ లోను రష్మిక, కృతి సనన్ అందాలతో అద్దరగొట్టారు. అయితే బాలీవుడ్ ఇండియా మొత్తం కృతి సనన్ అందాలను పొగుడుతూ రశ్మికను విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది.
కృతి సనన్ నటన, అందాలను పొగుడుతూ రష్మిక దియా పాత్ర ను విమర్శిస్తూ రివ్యూస్ వచ్చాయి. లుక్స్ విషయంలో కృతి బావుంది, రష్మిక తేలిపోయింది అంటూ రష్మికపై విమర్శలు గుప్పించడం చూసిన వారు రశ్మికను బాలీవుడ్ లో తొక్కసేలా పీఆర్ టీమ్ గట్టిగా పని చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







































