APలో గ్రాండ్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవం
International Yoga Day celebrated grandly in AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు జూన్ 21 ఆదివారం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యోగ గురువు రాందేవ్, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్ తో కలిసి ముఖ్యమంత్రి యోగాభ్యసనాలు చేశారు. నగర వాసులు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మట్లాడుతూ..
• ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్ దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేను.
• యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.
• ప్రధాని మోదీ ప్రపంచానికి భారత దేశ శక్తిని చాటుతున్నారు... దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారు.
• ప్రధాని చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
• ప్రపంచానికి భారత్ విశ్వగురు... ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారత దేశం.
• ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ పెంచేది యోగానే.
• యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్ దేవ్ బాబా కృషి అమోఘం.
• సాంకేతికత.. ఆధ్యాత్మికత కాంబినేషన్ తో వెళ్తేనే భవిష్యత్.
• ఆథ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం.
• ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దాం
• యోగాంధ్ర-2025లో విశాఖలో నిర్వహించి రికార్డులు సృష్టించాం.
• ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించాం.
• వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తాం.
• 1.33 లక్షల సెంటర్లల్లో కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారు.
• ఇంటింటికి యోగా చేరాలి... ప్రజారోగ్యం బాగుండాలి.. ఇదే ప్రభుత్వ లక్ష్యం.
• స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తాం.
• యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తాం.
• స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తాం.
• యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తాం.
• జంక్ ఫుడ్ వద్దు.. ఫాస్ట్ ఫుడ్ ను దూరంగా పెడదాం.
• ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నాం... రసాయన రహిత ఆహారాన్ని స్వీకరిస్తే అనారోగ్యం దరి చేరదు.
• రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతాం.
• సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.
• వైద్య నిపుణులను ప్రజలకు చేరువ చేస్తాం... సంజీవనిలో యోగాను చేరుస్తాం.
• రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదు.







































