మనస్సుకు విశ్రాంతి కోసమేనంటూ హాట్ బ్యూటీ పోస్ట్!
Kayadu Lohar Announces Social Media Breakగ్లామర్ ప్రపంచంలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటించే సెలబ్రిటీలు అప్పుడప్పుడు డిజిటల్ డిటాక్స్‌కు మొగ్గు చూపడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. తాజాగా ఇదే బాటలో యువ కథానాయిక కాయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. నిరంతరం ఆన్‌లైన్ ప్రపంచంలో గడపడం, అప్‌డేట్లతో బిజీగా ఉండటం వల్ల వచ్చే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కేవలం శారీరక శ్రమకే కాకుండా ఆలోచనలకు మనస్సుకు కూడా కాస్త ప్రశాంతత, విశ్రాంతి అవసరమని అందుకే కొన్ని రోజుల పాటు సామాజిక మాధ్యమాలకు పూర్తిగా దూరంగా ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో నిరంతరం ట్రోల్స్, నెగెటివిటీ, లైక్స్-కామెంట్ల వర్చువల్ ప్రపంచంలో బతికే సెలబ్రిటీలకు ఇలాంటి చిన్న విరామాలు ఎంతో అవసరమని భావిస్తున్నారు.
కయాదు లోహర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె అభిమానులు సైతం హర్షిస్తున్నారు. వరుస సినిమాలతో అలసి సొలసని అభిమాన తార విశ్రాంతి తీసుకోకపోతే ఎలా? అందం తరిగిపోదా? అంటూ ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. మరెంతో మంది అభిమానులు టేక్ కేర్ అంటూ రెట్టించిన అందంతో తిరిగి రా అంటూ రాసుకొచ్చారు.
గ్లామర్ పరిశ్రమలో ఉండే గ్లిట్జ్ అండ్ గ్లామర్‌ను కాసేపు పక్కన పెట్టి వ్యక్తిగత ప్రశాంతతకు ప్రాధాన్యతనిస్తూ అమ్మడు తీసుకున్న అడుగు సామాజిక మాధ్యమాలలో డిజిటల్ డిటాక్స్ ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేస్తోంది.







































