చెంచల్ గూడ జైలుకి ప్రభాస్
Prabhas To Enter Chanchalguda Jail
ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్స్ తో చాలా బిజీగా వున్నారు. సమ్మర్ వెకేషన్స్ ని కూడా ప్రభాస్ త్యాగం చేసి మరీ సినిమా షూటింగ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకేసారి ఫౌజీ, స్పిరిట్ చిత్రాల షూటింగ్స్ చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం స్పిరిట్ లాంగ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ ఐకానిక్ విమల్ థియేటర్ లో నైట్ షూట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఈ షెడ్యుల్ చివరి రోజు చెంచల్ గూడ జైలులోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే. స్పిరిట్ లో కీలకమైన జైలు సీక్వెన్స్ షూట్ ని సందీప్ రెడ్డి వంగ హైదరాబాద్ లోని చెంచల్ గూడ జైలులో ప్లాన్ చేసి పర్మిషన్ తీసుకుని అక్కడ షూట్ చేస్తున్నారు.
ప్రెసెంట్ షెడ్యూల్ లో లాస్ట్ డే ఈ చెంచల్ గూడ జైలులో జరుగుతుండడంతో ప్రభాస్ కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు. శరవేగంగా స్పిరిట్ షూట్ ని సందీప్ వంగ పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా.. హీరోయిన్ గా త్రిప్తి డుమ్రి నటిస్తుంది.







































