అల్లు అర్జున్ కి కోర్టు నోటీసులు
Hyderabad court summons Allu Arjun
2024 డిసెంబర్ 4న పుష్ప 2 విడుదల సందర్భంగా వేసిన ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకి సంబంధించి అల్లు అర్జున్‌కు తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11 ఉన్న అల్లు అర్జున్ సోమవారం వ్యక్తిగతం గా హాజరుకావాలి అని కోర్టు ఆదేశించింది.
ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీతేజ్ ఆసుపత్రికి సంబందించిన ప్రతి ఖర్చును అల్లు అర్జున్ టీమ్ భరిస్తుంది.
మరి ఈ కేసులో అల్లు అర్జున్ సోమవారం పర్సనల్ గా కోర్టుకు వస్తారా, లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Nampally Court has issued summons to actor Allu Arjun
← Peddi - Ram Charan Giving Up His Balance RemunerationKGF star Yash has officially joined the Alibaug elite →






































