ముంబైలో కేజీఎఫ్ స్టార్ యష్ 25కోట్ల ఫామ్ హౌస్!
KGF star Yash has officially joined the Alibaug eliteకన్నడ సూపర్ స్టార్, `కేజీఎఫ్` ఫేమ్ యష్ తన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్ని మరింత విస్తరించారు. ముంబైకి సమీపంలో ఉన్న ప్రముఖ తీరప్రాంత పర్యాటక ప్రాంతం అలీబాగ్‌లో ఆయన ఒక విలాసవంతమైన బీచ్‌ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. అలీబాగ్ తాలూకా, రాయ్‌గఢ్ జిల్లాలోని కామత్ గ్రామంలో, ప్రసిద్ధ కిహిమ్ బీచ్‌కు ఆనుకుని ఉన్న 1.3 ఎకరాల విస్తీర్ణంలోని లగ్జరీ ల్యాండ్‌ను యష్ తన భార్య రాధిక పండిత్‌తో కలిసి సొంతం చేసుకున్నారు. దాదాపు రూ. 24 కోట్ల భారీ వ్యయంతో జరిగిన ఈ హై-ప్రొఫైల్ రియల్ ఎస్టేట్ లావాదేవీ 18 మే 2026న రిజిస్టర్ అయ్యింది.
ఈ కొనుగోలులో భాగంగా ఈ స్టార్ కపుల్ ఇప్పటికే ఒక అతిథి గృహం సహా రెండున్నర ఎకరాలలో ఫామ్ ని దక్కించుకోగా... కేవలం స్టాంప్ డ్యూటీ రూపంలోనే దాదాపు రూ.1.44 కోట్లు చెల్లించారు. ముంబై నగర బిజీ లైఫ్‌కు దూరంగా... ప్రశాంతమైన వాతావరణంలో వీకెండ్స్ గడపడానికి బాలీవుడ్ సెలబ్రిటీలకు అలీబాగ్ ఒక కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. తాజా ఆస్తి కొనుగోలుతో యష్ కూడా షారూఖ్, కోహ్లీ లాంటి ఎలైట్ క్లబ్ సెలబ్రిటీలకు పొరుగువాడు అయ్యాడు.






































