ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> After The 2024 Election Kodali Nani Has To Be Arrest

కొడాలి నాని కి స్టార్ట్ అయ్యింది..

After The 2024 Election Kodali Nani Has To Be Arrest


2024 ఎన్నికల్లో గెలుస్తామని గర్వంగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని చూసి విర్రవీగిన కొడాలి నాని కూటమి ప్రభుత్వం గద్దెనెక్కగానే అరెస్ట్ లకు భయపడి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా బిల్డప్ ఇస్తూ సైలెంట్ అయ్యారు. 2019 నుంచి ఐదేళ్ల పాటు నోటికొచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసి బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని పై కూటమి ప్రభుత్వంలో పలు కేసులు నమోదు అయ్యాయి.

అయితే కొడాలి నాని అరెస్ట్ లకు భయపడి సైలెంట్ అయినప్పటికి.. ఏపీ ప్రభుత్వం కొడాలి ని అరెస్ట్ చేసేందుకు రెడీ అయిన సమయంలో ఆయన గుండె జబ్బు తో హైదరాబాద్, ముంబై తిరిగారు. ఆరోగ్యకారణాలు సాకుతో రాజకీయాలకు దూరం జరిగారు. కొడాలి నాని అరెస్ట్ విషయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు లోకేష్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.

ఇక ఇప్పుడు కొడాలి నాని కి స్టార్ట్ అయ్యింది. కూటమి ప్రభుత్వ కేసు ల నంచి తప్పించుకునే ఛాన్స్ కనిపించడం లేదు. వైసీపీ హయాంలో పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని..

కొడాలి నాని వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని, రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. కొడాలిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. కానీ అప్పుడు మినిస్టర్ స్థాయిలో ఉన్న కొడాలి ని విచారణకు పిలిచేందుకు ప్రభుత్వ అనుమతి కావాలి.

ఇక ఇప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక పరిశీలించిన కూటమి ప్రభుత్వం.. కొడాలిపై ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన కొడాలి నాని అరెస్ట్ తప్పేలా లేదు. ఇప్పటివరకు తప్పించుకున్న కొడాలి ఈసారి చిక్కినట్టే.
 

AP Govt Gives Permission To Prosecute YCP Leader Kodali Nani