నిజమైన హీరో అనిపించుకున్న రామ్ చరణ్
Peddi - Ram Charan Giving Up His Balance Remuneration
పెద్ది చిత్రం రిజల్ట్, సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా రామ్ చరణ్ నటుడిగా ఓ మెట్టు ఎక్కాడు. రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కు అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా ఇంప్రెస్స్ అయ్యారు. నటుడిగా రామ్ చరణ్ ఓ స్థాయికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు హీరో గా కాదు నిజమైన హీరో అనిపించుకున్నాడు.
కారణం పెద్ది చిత్రానికి సంబందించిన కొంత పారితోషికాన్ని రామ్ చరణ్ నిర్మాతలకు వదిలెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. రెండు వారాల క్రితమే భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ పెద్ది చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా.. హిట్ టాక్ రావడంతో రెండు వారాల్లో పెద్ది రూ.400 కోట్లు కలెక్ట్ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది కి బాగానే కల్లెక్షన్స్ వచ్చినా ఓవర్సీస్, నార్త్ లో పెద్ది ని ఎవరూ పట్టించుకోలేదు. దానితో కొన్ని చోట్ల పెద్ది బ్రేక్ ఈవెన్ ఇవ్వడం కష్టంగానే మారింది. ఈ చిత్రానికి గాను రామ్ చరణ్ రూ.120 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. అందులో చరణ్ కొంత తీసుకున్నారు, పెద్ది రిలీజ్ తర్వాత మిగతాది తీసుకోవాల్సి ఉంది.
కానీ పెద్ది రిజల్ట్ తో అటు హీరో రామ్ చరణ్ ఇటు దర్శకుడు బుచ్చి బాబు లు నిర్మాతను ఒడ్డున పడేయ్యాలని కొంత పారితోషికం తీసుకోలేదని తెలుస్తుంది. ఇది విన్న నెటిజెన్స్ రామ్ చరణ్ కేవలం హీరో కాదు నిజమైన హీరో అంటున్నారు.






































