దృశ్యం 3 ఓటీటీ టాక్
Drishyam 3 OTT public talk
దృశ్యం సీరీస్ లో పార్ట్ 1, పార్ట్ 2 మంచి హిట్ అయ్యాయి అంటే అందులో అదిరిపోయే ట్విస్ట్ లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని కట్టిపడేసాయి. నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీలోనే ప్రేక్షకులు మొదటి రెండు పార్ట్ లను ఆధరించారు. కానీ దృశ్యం 3 లో ఆ ట్విస్ట్ లే తక్కువయ్యాయి.
మోహన్ లాల్ -జీతూ జోసెఫ్ కలయికలో మే 21 న పాన్ ఇండియా భాషల్లో థియేటర్స్ లో విడుదలైన దృశ్యం 3 కి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది. కానీ అదే డివైడ్ టాక్ తో దృశ్యం 3 కలెక్షన్స్ వరద పారించింది. దృశ్యం 3 ఏకంగా రూ.225 ఓట్ల కలెక్షన్స్ కొట్టుకురావడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇపుడు ఈచిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.ముందు తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాదు అన్నప్పటికీ అమెజాన్ ప్రైమ్ లో యధావిధిగా తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భషాల్లో దృశ్యం 3 అందుబాటులోకి వచ్చింది. దృశ్యం 3 ని ఓటీటీ లో చూసిన వారు ఓకే ఓకే గా వుంది.
అదిరిపోయే ట్విస్ట్ లు లేవు, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కేవలం అమ్మాయి పెళ్ళీపైనే దృశ్యం 3 డైరెక్టర్ ఫోకస్ పెట్టారు, క్లైమాక్స్ లో ఆ ఒక్క ట్విస్ట్ సినిమాని కాపాడింది, లేదంటే ఈసినిమా అట్టర్ ప్లాప్ అయ్యేది అంటున్నారు. మరి మీరు ఓసారి ఓటీటీ లో చూసి ఎలా ఉందొ చెప్పెయ్యండి.






































