అక్కినేని ఫ్యాన్స్ మరీ వైలెంట్ గా ఉన్నారు

Akkineni fans are very violent


అఖిల్ లెనిన్ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు. లెనిన్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన లెనిన్ మేకర్స్.. ఆతరవాత సైలెంట్ అవడం వెనుక రీజన్ పెద్ది అయినప్పటికీ .. అక్కినేని అభిమానులు మాత్రం లెనిన్ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పై గుర్రుగా ఉన్నారు.

పెద్ది విడుదల సమయంలో లెనిన్ ని ప్రమోట్ చేస్తే సోషల్ మీడియాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అని లెనిన్ మేకర్స్ సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ పెద్ది థియేటర్స్ లో లేని టీజర్ ప్రదర్శించారు. దానికి అక్కినేని ఫ్యాన్స్ అగ్రినే. కానీ మధ్యలో లెనిన్ ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేస్తూ..

@AnnapurnaStdios ఈ అడ్మిన్ ఎవరో తెలియదు గానీ ఇతను నిద్రపోతున్నాడు ఇతని బదులు నాకు కానీ @KingVenkyBAF ఇద్దరి లో ఎవరికీ ఇచ్చినా పర్లేదు, మేము 24 hrs డ్యూటీ చేస్తాము లెనిన్ కోసం @AkhilAkkineni8 మీకు ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది #Leninonjune26 అంటూ తెగ ట్వీట్లు వేస్తున్నారు.

లెనిన్ అప్ డేట్స్ వదిలేందుకు నిర్మాత నాగవంశీ, దర్శకుడు అబ్బూరి రెడీనే.. కానీ పెద్ది సునామీలో లెనిన్ కొట్టుకుపోకుండా వారు ఓ వారం తర్వాత లెనిన్ ప్రమోషన్స్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. 

Lenin updates soon