ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Peddi release-heroine spotted in Tirupati

పెద్ది రిలీజ్-తిరుపతిలో తేలిన హీరోయిన్

Peddi release-heroine spotted in Tirupati

 

హీరోయిన్ జాన్వీ కపూర్ కి తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే వల్లమాలిన భక్తి. తన పుట్టిన రోజులకు, అలాగే ఇంకా ఏదైనా స్పెషల్ డేస్ కి జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం అలవాటు. అంతేకాదు ఏడు కొండలు కాలినడకన ఎక్కి తన భక్తిని చాటుకుంటూ ఆమె శ్రీవారిని దర్శించుకుంటుంది.

తాజాగా ఆమె నటించిన పెద్ది విడుదల నేపథ్యంలో జాన్వీ కపూర్ తిరుమల వెళ్ళింది. ఈరోజు విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని పెద్ది బ్లాక్ బస్టర్ అవ్వాలని మొక్కుకుంది. జాన్వీ కపూర్ తిరుమల వెళ్లిన విజువల్స్ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నిన్న రాత్రి నుంచే పెద్ది ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. పెద్ది బ్లాక్ బస్టర్ అంటూ ఆడియన్స్ తో సహా క్రిటిక్స్ కూడా పెద్దికి సూపర్ రేటింగ్స్ ఇచ్చారు. మరి జాన్వీ కపూర్ కోరికను శ్రీవారు నెరవేర్చినట్టుగానే కనిపిస్తుంది వ్యవహారం.

Janhvi Kapoor was spotted at Tirupati