120 కోట్లు డిమాండ్ చేస్తున్నాడనే సైలెంట్ గా!
Ajith Remuneration Demands Keeping Producers
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన స`గుడ్ బాడ్ అగ్లీ` చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఘనవిజయం అందుకున్నా? అజిత్ తదుపరి సినిమాను ప్రకటించకపోవడం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం అజిత్ కార్ రేసింగ్‌పై దృష్టి పెట్టడం వల్లే వెండితెరకు విరామం ఇచ్చారని కొందరు భావిస్తుండగా.. తమిళ ఫైనాన్షియర్ , డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణియన్ దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.
అజిత్ ఆశిస్తున్న భారీ రెమ్యూనరేషనే ఆయన కొత్త సినిమాలకు సంతకం చేయకపోవడానికి ప్రధాన కారణమని ఆరోపించారు. `గుడ్ బాడ్ అగ్లీ` సాధించిన అద్భుత విజయంతో అజిత్ పారితోషికాన్ని 110-120 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని.. కానీ అంతటి భారీ రిస్క్ తీసుకోవడానికి తమిళ నిర్మాణ సంస్థలు వెనుకాడుతున్నాయని తెలిపారు.
సన్ పిక్చర్స్, రెడ్ జెయింట్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు ప్రస్తుతం భారీ నష్టాల భయాన్ని నివారించేందుకుప్రాఫిట్ షేరింగ్ మోడల్ కు మొగ్గు చూపుతుండగా అజిత్ మాత్రం ఫిక్స్‌డ్ శాలరీ కోరుకుంటున్నట్లు సమాచారం.
ఈ పరిస్థితికి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి వారు తమిళ హీరోలకు ట్రేడ్ పరిమితులను మించి భారీ మొత్తాలు చెల్లించి మార్కెట్ సమీకరణాలను మార్చేయడమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అజిత్ ఇప్పటికే ఆర్థికంగా ఎంతో స్థిరపడినందున కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా చిత్ర పరిశ్రమ మనుగడను దృష్టిలో ఉంచుకుని మేకర్స్‌తో కలిసి పనిచేయాలని తద్వారా తమిళ చిత్రసీమకు మరిన్ని భారీ సినిమాలు దక్కుతాయని సుబ్రమణియన్ హితవు పలికారు.







































