మా ఇంటి బంగారం ఎలా ఉంది !
Maa Inti Bangaram Mini review
ఖుషి, శాకుంతలం చిత్రాల తర్వాత తన నిర్మాణ సంస్థ ట్రాలాల లో నిర్మించిన శుభం లో గెస్ట్ రోల్ చేసిన సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రం చేసింది. ఓన్ బ్యానర్, భర్త రాజ్ నిడిమోరు పర్యవేక్షణ, ఫ్రెండ్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేసిన మా ఇంటి బంగారం చిత్రం నేడు జూన్ 19 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. అదిరిపోయే అంచనాలు, అద్భుతమైన ప్రమోషన్స్ నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ఎలా ఉందొ చూద్దాం..
ఒక పెద్ద ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన సమంతకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.. ప్రతి సీన్ కి ముందు.. ఈమె ఎవరో తెలుసా అనే రేంజ్ లో ఒక బ్యాక్ రౌండ్ స్కోర్ వస్తుంది.. బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమానే.. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఫ్యామిలీ సీన్స్ తో నింపేశారు దర్శకురాలు నందిని రెడ్డి.
ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా కూడా రాజ్ నిడిమోరు రేంజ్ రైటింగ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.. ఇంటర్వెల్ కు కాస్త కథ గాడిన పడుతుంది.. సెకండ్ హాఫ్ నెమ్మదిగా మొదలైనా యాక్షన్ సన్నివేశాలతో ఊపు అందుకుంటుంది.. యాక్షన్ సీన్స్ బాగున్నాయి.. ఆ యాక్షన్ సీక్వెన్స్ లో సమంత మేకోవర్ అదిరిపోయింది..
కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరో రేంజ్ లో సమంత కు ఎలివేషన్స్ ఇచ్చారు.. కాకపోతే రొటీన్ కథ, అయినప్పటికీ స్టార్ పవర్ తో చాలావరకు ఈ సినిమాను తన భుజాల మీద మోసింది సమంత.. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా పేలాయి.. సమంత వన్ మ్యాన్ షో చేసింది.
దర్శకురాలు నందిని రెడ్డి తనవరకు ఈ కథ కోసం పూర్తి న్యాయం చేసింది..రాజ్ నిడిమోరు అక్కడక్కడ వెబ్ సిరీస్ తరహాలోనే స్లో స్క్రీన్ ప్లే రాశాడు.. మా ఇంటి బంగారం జస్ట్ వన్ టైం వాచ్.






































