నాగబంధం ట్రైలర్ - బ్రహ్మకమలం కోసం వేట
Nagabandham Trailer Released
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి చూపు జులై 3 న రాబోతున్న నాగబంధం పైనే ఉంది. అంతలా అభిషేక్ నామ నాగబంధం పై అంచనాలు పెంచుతున్నారు. సినిమా కోసం భారీ సెట్స్ వెయ్యడమే కాదు ప్రమోషన్స్ కోసం కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ దేవుడి సెట్స్ తో సినిమాపై ఆశక్తి ని క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో నాగబంధం ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బంగారు నిధులు మాత్రమే కాదు సకల బ్రహ్మాండాన్ని శాశించే బ్రహ్మ కమలం అనే బంగారు పువ్వు ఉంటుంది. ఆ బ్రహ్మకమలం కోసం రాక్షసులు, మనుషులు ఎందరో పోటీ పడుతుంటారు. దానిని కాపాడేందుకు నాగ సాధువులు తమవంతు ప్రయత్నాలు చేస్తారు.
అనకొండ తో బ్రహ్మకమలాన్ని కాపాడుతున్న సీన్స్, అలాగే కొన్ని విజువల్స్ ఈ ట్రైలర్ కి అద్భుతం అనే చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నా.. ట్రైలర్ అంతా గందరగోళంగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కాదు భారీగా కనిపిస్తున్నాయి.






































