3 ఇడియ‌ట్స్ సీక్వెల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్!

Hirani Gives 3 Idiots Sequel Update

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన `3 ఇడియట్స్` చిత్రానికి సీక్వెల్ కు స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం  ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరానీ- ప్రముఖ రచయిత అభిజాత్ జోషితో కలిసి  స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే య‌ధావిధిగా అవే పాత్ర‌లు కొన‌సాగుతాయా?   లేదా? అన్న సందేహం చాలా మంది లో ఉంది. ఈ నేప‌థ్యంలో పాత్ర‌ల ప‌రంగా చిన్న పాటి మార్పులు త‌ప్ప పెద్ద‌గా లేద‌ని తెలుస్తోంది.

ఆమిర్ ఖాన్ (రాంచో), ఆర్. మాధవన్ (ఫర్హాన్), శర్మన్ జోషి (రాజు)లు తమ పాత పాత్రలలోనే మరోసారి కనిపించనున్నారు. అయితే ఈసారి కథాంశం కాలేజీ వాతావరణంలో కాకుండా ఆ పాత్రలు చదువు పూర్తి చేసుకున్న 15-20 ఏళ్ల తరువాతి సరికొత్త జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించనున్నారు. సీక్వెల్‌లో కథానాయకులు వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌డం... పిల్లల బాధ్యతలతో పాటు జీవితంలో  క్లిష్టమైన దశ అయిన `మిడ్-లైఫ్ క్రైసిస్`  ఎదుర్కొంటున్నట్లు చూపించబోతున్నారుట‌.

మొదటి భాగంలో  వినోదాన్ని పంచుతూనే సమాజంలో ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలనే? బలమైన సందేశాన్ని అందించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో రెండో భాగంలో కూడా సునిశిత హాస్యంతో పాటు నేటి కాలానికి అవసరమైన  గొప్ప సందేశాన్ని జోడించనున్నట్లు దర్శకుడు హిరానీ స్పష్టం చేశారు. ఈ కొత్త కథ వినడానికి ఎంతో విభిన్నంగా? అద్భుతంగా ఉందని నటుడు ఆమిర్ ఖాన్ కూడా గతంలోనే సంతోషాన్ని వ్యక్తం చేసిన‌ట్లు హిరాణీ గుర్తు చేసారు.
 

Rajkumar Hirani Still Writing Script For 3 Idiots Sequel