అఫీషియల్ - NBK 111 లోకి కాజల్ ఎంట్రీ
Kajal Aggarwal's first-look poster from NBK111
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ సినిమా అనౌన్సమెంట్ రాగానే హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ను హీరోయిన్ గా ప్రకటించారు. ఆతర్వాత నయనతార స్థానంలోకి కాజల్ అగర్వాల్ వచ్చింది. NBK 111 ప్రాజెక్ట్ బడ్జెట్ ఇష్యుస్ తో సినిమా కథ తో పాటుగా హీరోయిన్ కూడా మారిపోయింది అన్నారు.
అదే నిజం. ఈరోజు జూన్ 19 న కాజల్ అగర్వాల్ బర్త్ డే స్పెషల్ గా NBK 111 ప్రాజెక్ట్ లోకి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంటర్ అవడమే కాదు ఆమె ఫస్ట్ లుక్ ని రివీల్ చేసారు మేకర్స్. భగవంత్ కేసరి తర్వాత కాజల్ రెండోసారి బాలయ్య తో రొమాన్స్ చేస్తుంది. NBK 111 లో కాజల్ సింపుల్ గా చీర కట్టులో ముడి కట్టి కనిపించింది.
రీసెంట్ గా జూన్ 10 న బాలయ్య బర్త్ డే రోజున NBK 111 నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ వదిలిన గోపీచంద్ మలినేని ఈ చిత్ర టైటిల్ రివీల్ చెయ్యకుండా సస్పెన్స్ లో పెట్టారు. ఇక బాలయ్య-గోపిచంద్ మలినేని కాంబో NBK 111 దసరా రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది.






































