Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trisha demands huge fee to work with filmmakers

నిర్మాత‌ల‌కు మైండ్ బ్లాంక్ చేస్తోన్న త్రిష‌!

Trisha demands huge fee to work with filmmakers

గత రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా దూసుకుపోతున్న త్రిష  కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకుంటున్నారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో కథానాయికల ప్రాధాన్యత కొన్నేళ్లకే పరిమితమవుతుందనే అపవాదును చెరిపివేస్తూ 43 ఏళ్ల వయసులోనూ ఆమె కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు.

ఇటీవల సూర్య సరసన ఆమె నటించిన `కరుప్పు` చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయం సాధించడంతో త్రిషను పరిశ్రమలో ఒక లక్కీ చార్మ్ గా అభివర్ణిస్తున్నారు. ఒకటి రెండు పరాజయాలు ఎదురైనా?  ఆ వెంటనే బ్లాక్‌బస్టర్ హిట్‌తో పునరాగమనం చేయడం ఆమె ప్రత్యేకత అని  చిత్రం మరోసారి నిరూపించింది.

ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో త్రిష తదుపరి చిత్రాల కోసం పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కబోయే ఒక ప్రతిష్టాత్మక తమిళ చిత్రం కోసం ఆమె ఏకంగా 12 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా `కరుప్పు` చిత్రానికి ఆమె దాదాపు 5 కోట్ల వరకు అందుకున్నట్లు ప్రచారం జరగ్గా ఇప్పుడు ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని కోరడం విశేషం. నిర్మాతలు ఈ పారితోషికాన్ని తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నప్పటికీ త్రిష మాత్రం  డిమాండ్ విషయంలో అస్సలు తగ్గనట్లు తెలుస్తోంది.

Is Trisha demanding Rs 15 Crore remuneration