రష్మిక ప్లేస్ లో నయనతార
Nayanthara Joins Kanchana 4 In Key Role
కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ గా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన కాంచన సీరియస్ లో ఇప్పుడు కాంచన 4 కూడా రూపు దిద్దుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చాలామంది పేర్లు వినిపించాయి. పూజ హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఇలా చాలా పేర్లు వినిపించినా ఫైనల్ గా రష్మిక కాంచన 4 లో హీరోయిన్ గా ఫైనల్ చేసారు అన్నారు.
కానీ ఇప్పుడు రష్మిక ప్లేస్ లోకి లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న నయనతార లారెన్స్ కాంచన 4 లోకి ఎంటర్ కాబోతుంది. నయనతార రోల్ కి చాలా ప్రాధాన్యత ఉంది అని.. ఈ సినిమా కథను ముందుకు నడిపించే కీలక మలుపులు, ఈ ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్‌లోనే ఉండబోతున్నాయని సమాచారం.
అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ కు స్క్రీన్ ప్రెజెన్స్, స్టార్ వాల్యూ కలిగిన హీరోయిన్ అవసరమని లారెన్స్ భావించి నయనతార కు భారీ పారితోషికం ఆఫర్ చేసి ఒప్పించినట్టుగా తెలుస్తోంది. దీంతో రష్మిక మందన్నాను కాదని లేడీ సూపర్ స్టార్ నయనతార వైపు మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే, నోరా ఫహీతి కూడా నటించబోతున్నారు.








































