లెనిన్ పై మెగా ఫ్యాన్స్ కోపం-తప్పులేదు
Lenin makers attract Mega Wrath
అఖిల్ లెనిన్ చిత్రం మే 1 న రిలీజ్ అవుతుంది అని ఎనౌన్స్ చేసిన తర్వాత రామ్ చరణ్ పెద్ది ని మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 30 కి పోస్ట్ పోన్ చెయ్యడంతో లెనిన్ చిత్రాన్ని పెద్ది కోసం త్యాగం చేస్తూ జూన్ 26 న రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలైన నాగవంశీ, నాగార్జున ప్రకటించారు. రామ్ చరణ్ అఖిల్ కి అన్న లాంటోడు, పెద్ది పెద్ద సినిమా, లెనిన్ తో పెద్ది ని ఇబ్బంది పెట్టము అన్నారు.
ఇక జూన్ 26 న లెనిన్ విడుదల అన్నాక పెద్ది ని మళ్లీ ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ చేస్తూ జూన్ 25 న విడుదల చేస్తారనే ప్రచారం జరగగానే అక్కినేని ఫ్యాన్స్ పెద్ది లెనిన్ ని వెంటాడుతుంది. కావాలని జూన్ 25 కి పెద్ది అంటున్నారు. మళ్లీ లెనిన్ పోస్ట్ పోన్ అయితే అది పెద్ది వలనే అంటూ పెద్ది పై అఖిల్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు.
ఇక పెద్ది జూన్ 4 న విడుదలైంది. అయితే అఖిల్ లెనిన్ కి జూన్ 26 న ఎదురు లేదు అనుకున్న అభిమానులకు నిర్మాతలు షాకిస్తూ జూన్ 26 నుంచి లెనిన్ ని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తూ జులై 10 కి కొత్త డేట్ ఇచ్చారు. దానితో మెగా ఫ్యాన్స్ లెనిన్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పెద్ది వలన లెనిన్ ఇబ్బంది పడుతుంది అన్నారు.
ఇప్పుడు లెనిన్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అవ్వక డేట్ మార్చుకున్నారు. దానితో మెగా ఫ్యాన్స్ మధ్యలో పెద్ది కోసం త్యాగం చేస్తున్నట్టుగా పెద్దిని బ్లేమ్ చేసారు అంటూ వారు లెనిన్ మేకర్స్ పై కోపంతో ఊగిపోతున్నారు. నిజమే కదా మెగా ఫ్యాన్స్ కోపంలో తప్పులేదు మరి.








































