Advertisement

సక్సెస్ ఇచ్చి ఫ్యాన్స్ కి షాకిస్తారా ?

Pawan Kalyan OG2 Update


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఏపీ క్యాబినెట్ సమావేశాలకు హాజరవవుతున్నారు. అటు రాజకీయాల్లో బిజీగా మారాలని పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తర్వాత ఇకపై సినిమాలు ఆపేస్తారు అనుకున్నారు. పవన్ క్రియేటివ్ వర్క్స్ యాక్టీవ్ అవడంతో ఇకపై పవన్ కళ్యాణ్ నటనకు బ్రేకిస్తారని అనుకున్నారు.

కానీ ఆయన ఇప్పుడు అనూహ్యంగా OG 2పై క్రేజీ అప్ డేట్స్ అందించడం ద్వారా పవన్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపారు. అయితే పవన్ కళ్యాణ్ OG 2 తర్వాత వరసగా సినిమాలు చేయరా, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తారా, లేదంటే OG సీక్వెలె లాస్ట్ సినిమానా అనే అనుమానాలు చాలామందిలో నడుస్తున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు అనుకున్నంత హిట్ కాకపోవడంతో ఇప్పుడు OG 2 చేసి దానిని హిట్ చేసి అభిమానులను కూల్ చెయ్యడమే కాదు OG 2 సక్సెస్ తో పవన్ కళ్యాణ్ నటనకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

OG 2 తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని, జనసేనను బలోపేతం చేసి అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ పార్టీని పటిష్టంగా విస్తరించాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. 

Pawan Kalyan-OG 2