నిర్మాతలకి వెంకీ, త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఫోన్లు!!

Sat 13th Jan 2018 02:33 PM
venkatesh,jr ntr,phone call,trivikram srinivas,radhakrishna  నిర్మాతలకి వెంకీ, త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఫోన్లు!!
Venkatesh Phone to Radhakrishna and NTR Phone to Trivikram నిర్మాతలకి వెంకీ, త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఫోన్లు!!
Sponsored links

ఎంతో హైప్ తో అజ్ఞాతవాసి విడుదల అయ్యి నెగెటివ్ టాక్ తో రన్ అవుతుంది. ఇంత భారీ అంచనాలతో వచ్చిన సినిమాకు టాక్ సరిగా లేకపోవటంతో నిర్మాత, దర్శకులు కాస్త డీలా పడడం సహజం. ఇదే నిర్మాత, దర్శకుడు కాంబినేషన్ లో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకటి విక్టరీ వెంకటేష్ తో, ఇంకోటి ఎన్టీఆర్ తో.

అజ్ఞాతవాసి రిజల్ట్ తెలుసుకున్న వెంకటేష్, తారక్ స్వయానా నిర్మాతకు, డైరెక్టర్ కు ఫోన్ చేశారనే ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ నేరుగా నిర్మాత రాధాకృష్ణకు ఫోన్ చేసి సినిమా అన్నాక జయాపజయాలు కామన్, ఇవ్వన్నీ లైట్ తీసుకుని మన సబ్జెక్టు మీద దృష్టి పెట్టండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది.

మరోవైపు ఎన్టీఆర్ కూడా డైరెక్ట్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఫోన్ చేసి.. మనం కచ్చితంగా హిట్ కొడుతున్నాం, మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు.. డోంట్ వర్రీ అని చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా పూర్తిగా లవ్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్టు అంట. పైగా పవన్ లాగ ఎన్టీఆర్ తో సమస్యలు, షరతులు ఉండవ్. సో సినిమా బాగానే ఉంటుందని చెబుతున్నారు.

Sponsored links

Venkatesh Phone to Radhakrishna and NTR Phone to Trivikram:

Celebrities Phone Calling to Agnathavasi Producer and Director

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019