కాకా: మెగాస్టార్ ఇంటెన్స్ అవతార్‌

Kaaka: Diwali special posterKaaka: Diwali special poster

 

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో ఆయనను ఆసక్తికరమైన షేడ్స్‌లో పరిచయం చేయడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

వర్షంతో తడిసిన వాతావరణంలో, పచ్చని పొలాల మధ్య చేతిలో కొడవలి పట్టుకుని ఇంటెన్స్ గా నిలబడిన చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సినిమా రా అండ్ ఇంటెన్స్ ప్రజెంట్ చేస్తోంది. చిరంజీవి ఫియర్స్ అవతార్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సందర్భంగా ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో ‘కాకా’ మేజర్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా థామస్‌తో పాటు బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అనస్వర రాజన్‌ను ‘హార్ట్ ఆఫ్ కాకా’గా ఆమె పాత్ర పేరు ‘అమ్ములు పాప’గా పరిచయం చేశారు. అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో భాగం కావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

Kaaka new poster out