స్టేషన్ లోపల దువ్వాడ - బయట దివ్వెల రచ్చ
Divvela Madhuri stages a protest in front of the police station
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో గత మార్చి నెలలో ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై కేసు నమోదు అయ్యింది. జూన్ 22 సోమవారం అంటే ఈరోజు కొత్తూరు పోలీస్ స్టేషన్ కి దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరవ్వమని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
దానితో శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం రాగా.. ఆయనతో పాటుగా దివ్వెల మాధురి కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లోపలి వెళ్లగానే వద్ద దివ్వెల మాధురి స్టేషన్ బయట హల్‌చల్ సృష్టించారు. స్టేషన్ లోపల శ్రీనివాస్ ఉండగా, బయట మాధురి శ్రీనివాస్ ను విడుదల చెయ్యాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన చేశారు.
ఆమె స్టేషన్ ఎదుట ధర్నా చేస్తూ అభిమానులతో కలిసి రచ్చ చేస్తుండగా.. పోలీసులు దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకోగా ఆమె పోలీసులపై తిరగబడిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కాసేపటి తర్వాత వదిలేసారు.







































