ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10 : Nag fires on Debjani and Neethu Master

BB10: దేబ్జానీ, నీతూ మాస్టర్ పై నాగ్ ఆగ్రహం

Bigg Boss Telugu 10 : Nag fires on Debjani and Neethu MasterBigg Boss Telugu 10 : Nag fires on Debjani and Neethu Master


ఈ శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఎవరి మీద ఫైర్ అవుతారు, ఎవరెవరికి క్లాస్ ఇస్తారు అనే విషయంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నడుస్తుంది. ప్రతి శనివారం నాగార్జున ఇచ్చే క్లాస్, పనిష్మెంట్స్ అన్ని ఆడియన్స్ లో ఉత్సుకత రేపుతాయి. అందుకే ఈవారం ఎవరెవరికి హోస్ట్ చేతిలో తిట్లు పడతాయా అని ఎదురు చూసారు.

ఈ వారం ఆటల్లో ఓడిపోయి తట్టుకోలేక మాట్లాడిన దేబ్జానీ, అలాగే త్రిగుణ ని టార్గెట్ చేయబోయి నోరు జారిన నీతూ మాస్టర్ ని నాగార్జున ఎక్కువగా టార్గెట్ చేసారు. దేబ్జానీ ఈ వారం నీ ఆట కు ఎన్ని మార్కులు వేసుకుంటావ్ అంటే.. 2 మార్క్స్ సర్.. ఆడలేదు ఓడిపోయాను అంది, అప్పుడు నువ్ మాట్లాడిన మాటలేమిటి అంటే ముఖేష్ ని మగాడేనా అన్నావ్ అది కరెక్ట్ ఆ అంటూ దేబ్జానీ కి క్లాస్ ఇచ్చారు.

ఇక వర్షిణి కులుకుతున్నావ్ అని వంశి అన్నాడు అన్నావ్, అంటే అవును సర్ అన్నది, నువ్వు విన్నావా వుహించుకున్నావా.. కులుకుతున్నావ్ అంటే వయ్యారాలు పోవడం అంటూ వర్షిణికి ఎక్ష్ప్లైన్ చేసారు నాగ్. ఇక నీతూ మాస్టర్ ని లేపి ఆమెను ముఖేష్ తన్నిన వీడియో తో పాటుగా త్రిగుణ తో గొడవ పడే వీడియో చూపించి నువ్వు ఏం మాట్లాడావ్ అన్నారు, దానికి నేను మాత్రమే కాదు శ్వేతా, అమన్ కూడా విన్నారు అంటే వాళ్ళను కూడా నాగ్ అడిగారు. కానీ వాళ్ళు వేరే చెప్పారు.

దానికి త్రిగుణ కంపోజ్ చేసిన వీడియో వేశారు, అక్కడ త్రిగుణ చెప్పింది వేరు, కానీ నీతూ నువ్వు అప్పుడే ఎందుకు డిఫెండ్ చెయ్యలేదు అంటే నాకు భయమేస్తుంది అంది, దానికి ఎప్పుడు మాట్లాడాలో అపుడు మాట్లాడకపోతే మిస్ ఫైర్ అవుతుంది అంటూ నీతూ మాస్టర్ కి హోస్ట్ నాగ్ క్లాస్ పీకిన ప్రోమో వైరల్ అవుతుంది. 

Bigg Boss Telugu 10 new promo