సినిమా బావుంది కానీ.. ఓపెనింగ్స్ లేవు

Summer Holidays Movie TalkSummer Holidays Movie Talk


చిన్న సినిమాగా ఈ శుక్రవారం రెండు పెద్ద డబ్బింగ్ చిత్రాల నడుమ బాక్సాఫీసు దగ్గర భారీ కాదు కాదు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో సందడి చేసిన సమ్మర్ హాలిడేస్ చిత్రానికి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. నిర్మాత ధీరజ్ మొగిలినేని తన సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు బాగా కష్టపడ్డారు.

ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ఉన్నా ఈ చిత్రానికి చెప్పుకోదగిన ఓపెనింగ్స్ రాలేదు. కారణం రామాయణ, సూర్య సీన్ చిత్రాలు. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావడం, పెద్ద హీరోలు కావడంతో ఆ రెండు చిత్రాలవైపు తెలుగు ప్రేక్షకులు మొగ్గు చూపారు. దానితో సమ్మర్ హాలిడేస్ కి బాగా ఎఫెక్ట్ అయ్యింది.

కంటెంట్ పై నమ్మకం ఉంది కనకే ఆ పెద్ద చిత్రాలపై తన సినిమాని విడుదల చేసారు. కానీ ఆ చిత్రానికి పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. మరి మంచి సినిమా.. టాక్ బావుంది, మౌత్ టాక్ తో ఈ వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా సమ్మర్ హాలిడేస్ థియేటర్స్ వైపు కదిలితే చిన్న చిత్రం పెద్ద సక్సెస్ అవుతుంది. 

Summer Holidays Movie Social Media Talk