కల్కి 2: ప్రభాస్ ఎపుడు దొరకాలి
Nag Ashwin shares Kalki 2 update
ఇంకేంటి ప్రభాస్ కల్కి 2 లో జాయిన్ అవుతారంటూ గత రెండు నెలలుగా ఒకటే ముచ్చట నడుస్తుంది. ఒకేసారి ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 షూటింగ్ లు చేస్తారంటూ భీభత్సంగా ప్రచారం జరిగింది. కమల్ హాసన్, అమితాబ్ లు ఇప్పటికే కల్కి 2 సెట్ లోకి వచ్చారు. కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. ఇక ప్రభాస్ రావడమే లేట్.
కానీ ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ టార్గెట్స్ పూర్తి చెయ్యాలి. అంటే ఇప్పుడప్పుడే కల్కి 2 సెట్ లోకి ఆయన వెళ్లే పరిస్థితి లేదు. అదే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా చెబుతున్నారు. ఆయన నిన్నరాత్రి జరిగిన దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ వేదికపై ఆయన కల్కి 2 అప్ డేట్ షేర్ చేసారు.
కల్కి 2కి సంబందించిన షూటింగ్ కేవలం పది రోజులు మాత్రమే జరిగింది, ప్రభాస్ డేట్స్ దొరకగానే ఓ పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తామంటూ నాగ్ అశ్విన్ చెప్పడంతో.. హా అది ఇప్పట్లో అయ్యే పని కాదులే.. ప్రభాస్ ముందు ఫౌజీ, తర్వాత స్పిరిట్ షూటింగ్స్ పూర్తి చెయ్యాలి, అప్పుడే ఆయన కల్కి 2 సెట్ లో అడుగుపెడతారని అంటున్నారు.







































