బాలయ్య రిస్క్ చేస్తున్నారా?
Balayya health update
నందమూరి బాలకృష్ణ రిస్క్ చేస్తున్నారా.. కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పినా ఆయన వినడం లేదా... ఇప్పుడు ఇదే అందరి దగ్గర నుంచి వినిపిస్తున్న మాట. ప్రస్తుతం కాలి గాయంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య ఎప్పుడెప్పుడు NBK 111 సెట్ లోకి వెల్దామా అని ఎదురు చూస్తున్నారు. తన వల్ల నిర్మాత నష్టపోకూడదు అని బాలయ్య ఆలోచన. అందులో తప్పుబట్టడానికి లేదు.
కానీ ఆయన ఆరోగ్యం పూర్తిగా సెట్ కాలేదని, రక్షా బంధన్ వీడియోలో కాలికి కట్టుతో కనిపించారు. ఇంకా కోలుకొని బాలయ్య రిస్క్ చేసి సెట్ లోకి వస్తే మళ్లీ గాయం తిరగబెడుతుందేమో అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ నెల 6 న NBK 111 షూటింగ్ మొదలు పెట్టడానికి దర్శకుడు గోపీచంద్ సిద్దమవుతున్నారట.
బాలయ్య లేని సన్నివేశాలను ముందుగా కంప్లీట్ చేస్తారని, అక్టోబర్ మొదటివారంలో బాలయ్య NBK 111 సెట్ లో జాయిన్ అవుతారని అంటున్నారు. అప్పటికి బాలయ్య పూర్తిగా కోలుకుంటారని తెలుస్తుంది. ఈనెల 6 న NBK 111 టైటిల్ అలాగే రిలీజ్ డేట్ రివీల్ చెయ్యబోతున్నారు మేకర్స్.







































