కాకా లో మెగాస్టార్ డబుల్ ధమాకా

Chiranjeevi Dual Role In Kaaka MovieChiranjeevi Dual Role In Kaaka Movie


మెగాస్టార్ చిరంజీవి - బాబీ కలయికలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కాకా చిత్ర గ్లింప్స్ చిరు బర్త్ డే కి వదిలి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. కాకా లో సూపర్ వైజర్ సత్యం రోల్ లో చిరంజీవి సాఫ్ట్ గానే కనిపించారు. అయితే ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.

అందులో ఒకటి మిడిల్ ఏజ్ పాత్ర కాగా, రెండోది ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రి పాత్ర గా ఉండబోతుంది అని.. ఒక పాత్ర మాస్ యాంగిల్ లో యంగ్ లుక్ లో ఉంటె.. మరో పాత్ర బాధ్యత ఉన్న వ్యక్తిగా కనిపించే ఈ పాత్రలో కామెడీ, ఎమోషన్‌, యాక్షన్‌ కలగలిపి ఉండబోతున్నాయట.  

డ్యూయెల్ రోల్ లో చిరు అభిమానులకు ట్రీట్ ఇస్తారని, దర్శకుడు బాబీ చిరు ని చాలా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తున్నారని.. అంతేకాకుండా ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ కాబోతున్నాయని తెలుస్తుంది. కాకా ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా డేట్ లాక్ చేసిన విషయం తెలిసిందే.

Mega Star Chiranjeevi Dual Role In Kaaka Movie