ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Three Months: A Perfect Comeback for Three stars

మూడు నెలలు: ముగ్గురికి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్

Three Months: A Perfect Comeback for Three starsThree Months: A Perfect Comeback for Three stars


ఈ ఏడాది జూన్, జులై మరియు, ఆగష్టు ఈ మూడు నెలలు ముగ్గురు స్టార్స్ కి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చాయి. జూన్ లో సమంత కు మా ఇంటి బంగారంతో రూ.100 కోట్లు వచ్చాయి. ఖుషి, శాకుంతలం ప్లాప్స్ తర్వాత సమంత జూన్ లో వచ్చిన మా ఇంటి బంగారం సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఆ చిత్రంతో సమంత రూ.100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది.

ఇక జులై లో అక్కినేని అఖిల్ లెనిన్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. తొమ్మిదేళ్లుగా సక్సెస్ కోసం సఫర్ అవుతున్న అఖిల్ ని లెనిన్ చిత్రం నిలబెట్టింది. జులై లో విడుదలైన లెనిన్ చిత్రం అఖిల్ ఖాతాలో మొదటి హిట్టుగా నిలవడమే కాదు రూ.100 కోట్ల క్లబ్బులో చేరి అఖిల్ క్రేజ్ పెరిగేలా చేసింది. అఖిల్ ప్లాప్ ల పరంపర కి లెనిన్ అడ్డుకట్ట వేసింది.

ఇక ఆగష్టు రవితేజ ని నిలబెట్టింది. వరస ప్లాప్స్.. రవితేజ మర్కెట్ ని డౌన్ చేసిన సమయంలో ఆయనకు ఇరుముడి చిత్రం అద్భుతమైన హిట్ ని అందించింది. ఆగష్టు 21 న విడుదలైన ఇరుముడి తో రవితేజ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇరుముడి రవితేజ కెరీర్ లో స్పెషల్ మూవీగా మిగిలిపోయేలా ఉంది.

ఇరుముడి ర్యాంపేజ్ రవితేజ ను గట్టెక్కించింది. ఇరుముడి రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యింది. సో వరసగా మూడు నెలలు ముగ్గురు స్టార్స్ కెరీర్ ని నిలబెట్టాయనే చెప్పాలి.

Samantha-Akhil-Ravi Teja