NBK 111: ఇంట్రెస్టింగ్ న్యూస్

Interesting News on NBK111Interesting News on NBK111

 

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మోకాలి సర్జరీ తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎప్పటికపుడు AIG వైద్యులు ఆయనకు చెకప్ చేస్తూ ఫిజియోథెరపీ కూడా చెయ్యాలని సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే బాలయ్యకు సెట్ లో తగిలిన గాయం వలన ఆగిన NBK 111 షూటింగ్ కోసం ఆయన ఎప్పుడెప్పుడు సెట్ కి వెళ్లాలా అని ఎదురు చూస్తున్నారు.

నిర్మాతలకు తన వల్ల ఇబ్బంది కలుగకూడదు అని బాలయ్య ఆలోచిస్తున్నారు. తాజాగా దానికి సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆయన రెస్ట్ లో ఉండడంతో సెట్ లోకి కాకుండా.. ఆయన ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతున్నారట.

అంతేకాకుండా మరో నెల రోజుల్లో అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి మైసూరులో NBK111 కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ కథతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దాదా అలాగే గాడ్ అనే రెండు టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Balakrishna is set to begin dubbing for NBK111