మాస్ మహారాజ్ రవితేజ కు బిగ్ రిలీఫ్

Big Relief for Ravi TejaBig Relief for Ravi Teja

 

మాస్ మహారాజ్ రవితేజ కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిన స్టేజ్ లో రవితేజ ఇరుముడి తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. శివ నిర్వాణ రవితేజ కు బ్లాక్ బస్టర్ అందించారు. ఇరుముడి రవితేజ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా మిలిగిలిపోతుందా అనేలాంటి టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది.

ఇరుముడి విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నప్పటికీ.. ఊహించని విజయం రవితేజ ను ఇరుముడి రూపంలో వరించింది. ఇరుముడి ఓపెనింగ్ పరంగాను రవితేజ కెరీర్ లో బెస్ట్ గా నిలిచింది. ఇరుముడి తో రవితేజ మునుపటిలా ఫామ్ లోకి వచ్చేసారు. ఈమధ్యకాలంలో ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి ఓవరాల్ గా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది ఇరుముడి నే.

సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఇలాంటి టాక్ తెచ్చుకున్నప్పటికీ అది తమిళ డబ్బింగ్ మూవీ. ఇరుముడి తో రవితేజ పుంజుకున్నారు. వరస వైఫల్యాలతో ఆయనతో సినిమాలు తీసేందుకు వెనక్కి తగ్గిన నిర్మాతలు ఇప్పుడు ఆయన ఇంటి డోర్ ముందు నిల్చోవడం ఖాయం.

అంతేకాదు పారితోషికం విషయంలో రవితేజ ను బ్లేమ్ చేసిన వారు కామ్ అవడం కూడా ఖాయమే. ఏది ఏమైనా ఇరుముడి రవితేజ కెరీర్ ని సేవ్ చేసింది అనే చెప్పాలి.

Ravi Teja -