ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Priyanka stylish look at Madison Square Garden

మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ప్రియాంక స్టైలిష్ లుక్

Priyanka stylish look at Madison Square GardenPriyanka stylish look at Madison Square Garden

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త  నిక్ జోనాస్ పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరిగిన జోనాస్ బ్రదర్స్ కన్సర్ట్‌కు హాజరైన ప్రియాంక ..నిక్ జోనాస్ ఫోటో ఉన్న  ప్రత్యేకమైన టీ-షర్ట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కన్సర్ట్ సందర్భంగా పీసీ  భర్తకు అత్యంత ఉత్సాహవంతురాలైన చీర్‌లీడర్‌గా నిలిచారు.

సోషల్ మీడియాలో ప్రియాంక కన్సర్ట్ లుక్‌ను పంచుకోవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె ధరించిన బ్లాక్ కలర్ ఓవర్‌సైజ్డ్ టీ-షర్ట్ మీద నిక్ జోనాస్‌కు సంబంధించిన  రేసీ (బోల్డ్) ఫోటో ఉంది. ఇది 2014లో నిక్ జోనాస్ ఒక మ్యాగజైన్ కోసం చేసిన పాత ఫోటోషూట్‌కు చెందినది. ఈ టీ-షర్ట్‌ను ప్రియాంక చాలా స్టైలిష్‌గా ధరించడమే కాకుండా  ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో `నైట్ 2 #MSG @jonasbrothers` అని క్యాప్షన్ ఇచ్చి  జోనాస్‌ను ట్యాగ్ చేశారు.

నిక్ జోనాస్, కేవిన్ జోనాస్ ,  జో జోనాస్ బృందం `బర్నింగ్ అప్ టూర్ ఆల్ ఓవర్ ఎగైన్` పేరుతో వరుసగా కన్సర్ట్‌లను నిర్వహిస్తున్నారు. భర్త కు మద్దతు తెలపడంలో ఎప్పుడూ ముందుండే ప్రియాంక ఈ మ్యూజికల్ ఈవెంట్‌లో అత్యంత ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా? కుటుంబానికే మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో జోనాస్ బ్రదర్స్ సంగీత వేడుకల్లో సందడి చేస్తున్నారు.
 

Priyanka Chopra rocks RACY tee with pic of Nick Jonas