విశ్వంభర అసలు మేటర్ ఎక్కడా?
Vishwambhara OST Released
మెగాస్టార్ బర్త్ డే సంబరాలు మొదలైన 18 గంటలకు దర్శకుడు వశిష్ట మెల్లగా విశ్వంభర OST వదిలారు. ఈరోజు శనివారం మధ్యాన్నం వరకు సస్పెన్స్ లో పెట్టి సైలెంట్ గా విశ్వంభర నుంచి పవర్ ఫుల్ పోస్టర్ OST ని వదిలిన దర్శకుడు వశిష్ట అసలు మేటర్ మాత్రం చెప్పలేదు.
విశ్వంభర OST లో నీలికళ్ళతో చిరు త్రిశూలం పట్టుకోగా, గణగణ అంటూ బ్యాక్ రౌండ్ లో వచ్చిన సాంగ్ గుడ్ బంప్స్ తెప్పించింది. ఆ OST తో మెగా ఫ్యాన్స్ హ్యాపీ ఫీలైనా.. ఇప్పుడు డిజప్పాయింట్ అవుతున్నారు. కారణం విశ్వంభర నుంచి ఇంత సింపుల్ సర్ ప్రైజ్ రావడం ఒక ఎత్తైతే.. మరొకటి విశ్వంభర రిలీజ్ తేదీ ఇవ్వకపోవడం.
ఊరించి ఊరించి ఉసూరుమనిపించినట్టుగా వశిష్ట విశ్వంభర విడుదల తేదీ, కానీ మిగతా ఏ విషయాలు కానీ రివీల్ చెయ్యకుండా మెగా ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు. దానితో మెగా ఫ్యాన్స్ లో అసలు విశ్వంభర విడుదల ఈ ఏడాది ఉంటుందా అనే అనుమానం కూడా మొదలయ్యింది. చూద్దాం విశ్వంభర విషయంలో వశిష్ట ప్లాన్ ఏమిటో అనేది.







































