మరోసారి అనుమానాలు రగిలించారు
Tharun Bhascker and Eesha Rebba Spotted at Hyderabad Airport
కొద్దిరోజులుగా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోయిన్ ఈషా రెబ్బ లు ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో కనిపించడమే కాదు అటు తరుణ్ భాస్కర్, ఇటు ఈషా రెబ్బ ఇద్దరూ అనుమానాలకు ఆజ్యం పోస్తున్నారు.
వీరిద్దరూ కలిసి ఓం శాంతి శాంతి శాంతిః సినిమా చేస్తున్నప్పటి నుంచి ప్రేమలో పడ్డారు, తర్వాత సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ కి వివాహమై విడాకులయ్యాయి. ఈషా రెబ్బ తరుణ్ భాస్కర్ ప్రేమలో పడింది. అందుకే వీరిద్దరూ కలిసి విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్ళికి వెళ్లారనే ప్రచారం జరిగింది.
ఆతర్వాత వీరిద్దరూ సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బలు కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఎయిర్ పోర్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బలు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోవడానికే కలిసి వెళ్లారు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి అందులో నిజమెంతుందో వారిద్దరూ రియాక్ట్ అయితేనే తెలుస్తుంది.







































