రామాయణం థియేట్రికల్ రైట్స్ ఆయనకేనా!
Karan Johar’s Massive Theatrical Deal for Ramayanaబాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం `రామాయణం`. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నా యో? చెప్పాల్సిన పనిలేదు. యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెండు కీలక అప్‌డేట్స్ వచ్చేసాయి.
ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ ఒప్పందం సినిమా దేశవ్యాప్త విడుదల పట్ల నిర్మాణ సంస్థల నమ్మకాన్ని, ప్రణాళికను తెలియజేస్తోంది. సినిమా ట్రైలర్ జూలై 18 ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మాధ్యమాల్లో విడుదల చేయనున్నారు. గతంలో `సినిమాకాన్లో` ప్రదర్శించిన ట్రైలర్‌ను ఇప్పుడు ప్రేక్షకులందరూ చూసే అవకాశం కలగనుంది.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్- మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ - ఆస్కార్ అవార్డు గ్రహీత వీఎఫ్ఎక్స్ సంస్థ డీఎన్‌ఈజీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఐమాక్స్ - డాల్బీ సినిమా ఫార్మాట్‌లలో ప్రత్యేక అనుభూతిని అందించనుంది. దీపావళి కానుకగా మొదటి భాగాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేస్తున్నారు. రెండవ భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ప్రస్తుతం రెండవ భాగం షూటింగ్ జరుగుతోంది.







































